యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ”నేను స్టూడెంట్ సర్!’. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, తాజాగా చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించింది. ‘నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ మాయే మాయే డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గణేష్, అవంతికల జోడి చూడముచ్చటగా వుంది. ఈ చిత్రంతో అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.
Category: News
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ…
“ఎన్టీఆర్ 30” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు కొరటాల…
సూపర్ కూల్ గా, స్టైలిష్ గా మెగా పవర్ స్టార్!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC15 వర్కింగ్ టైటిల్ తో తన రాబోయే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారనే వార్త…
“డీజే వీరయ్య” మాస్ పార్టీ కి అదిరే రెస్పాన్స్.!
మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్…