పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే సగటు మెగా, పవన్ అభిమానులకు గుర్తొచ్చేది ఆయన మార్షల్ ఆర్ట్స్ గురించే. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకూ ప్రతి సినిమాలో.. ఆయన చేసే ఫైట్స్ లో ఆ ఛాయలు కొంతైనా కనిపిస్తాయి. ఖుషిలో మార్షల్ ఆర్ట్స్ ఫైట్ అభిమానుల్ని ఆకట్టుకుంది. తమ్ముడులో కిక్ బాక్సింగ్, జానీ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కినవే. ఇప్పుడు మళ్లీ పవన్ తన ఒరిజినల్ స్కిల్స్ కు పదును పెడుతున్నారు.ఈమేరకు ఆయన పోస్ట్ చేసిన పిక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్, కత్తిసాము, గుర్రపు స్వారీ చేస్తున్నారు. ఇప్పటికే యుద్ధ విద్యలూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ డ్రెస్ లోనే పవన్ ప్రాక్టీస్ చేస్తున్న పిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 20ఏళ్ల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను అంటూ పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన పిక్ అభిమానుల్ని అలరిస్తోంది.
